మేఘాలయా ముఖ్యమంత్రిగా కొన్రాడ్ సంగ్మా..

SMTV Desk 2018-03-06 12:59:47  meghalaya cm, cronad singma, Oath, central minister rajnath.

షిల్లాంగ్, మార్చి 6 : మేఘాలయా ముఖ్యమంత్రిగా కొన్రాడ్ సంగ్మా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. నేటి ఉదయం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ పీఏ సంగ్మా కుమారుడైన కొన్రాడ్ సంగ్మా.. మేఘాలయకు 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా మేఘాలయలో ఎన్‌పీపీ 19 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 21 సీట్లు దక్కినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. బీజేపీ పొత్తుతో సంగ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగ్మాకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ అభినందనలు తెలియజేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా సంగ్మా ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.