పాత రోజులను గుర్తు చేసిన ఎం.ఎస్.ధోని..!

SMTV Desk 2018-03-05 19:02:42  MS DHONI, NEW ADVERTISE, LONG HAIR, SOCIAL MEDIA.

ఢిల్లీ, మార్చి 5 : టీమిండియా క్రికెటర్ మాజీ కాప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ.. క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో పొడవాటి జుట్టుతో కనిపించి ఫ్యాషన్ ప్రపంచ౦లో కొత్త ట్రెండ్ ను సృష్టించాడు. తాజాగా ధోనీ ఓ చాక్లెట్‌కు సంబంధించిన యాడ్‌లో పాల్గొన్నాడు. ఇందులో ధోనీ ఎప్పుడూ కనిపించని కొత్త గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. చాలా రోజుల తర్వాత ధోనీ మళ్ళీ పొడవాటి జుట్టుతో దర్శనమిస్తూ.. పాత రోజులను గుర్తు చేశాడు. దీనిపై స్పందించిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ధోనీకి సంబంధించిన ఈ యాడ్‌ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.