అంబానీ ఇంట పెళ్లి సందడి..!

SMTV Desk 2018-03-05 18:57:18  mukhesh ambani, son marriage, roji blue diamonds director rasel mehatha daughter.

ముంబై, మార్చి 5 : భారతీయ అగ్రవ్యాపారి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ ఓ ఇంటివాడు కానున్నాడు. వజ్రాల వ్యాపారి, రోజీ బ్లూ డైమండ్స్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ రసెల్‌ మెహతా, మోనాల చిన్న కుమార్తె శ్లోక మెహతాను ఆయన మనువాడబోతున్నారు. త్వరలోనే వారి నిశ్చితార్థం తేదీని ప్రకటించి, డిసెంబరు ప్రారంభంలో పెళ్లి ముహూర్తం నిర్ణయి౦చనున్నట్లు సమాచారం. ఆకాష్‌, శ్లోక ఇద్దరూ ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం ఆకాశ్‌ రిలయన్స్‌ జియో బోర్డులో కొనసాగుతున్నారు. ఇటీవల పీఎన్‌బీ కుంభకోణంలో వెలుగులోకి వచ్చిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి మోనా బంధువు కావడం గమనార్హం.