కొత్త ప్రయోగాలను ఆవిష్కరించండి : కేటీఆర్

SMTV Desk 2018-03-05 17:58:04  ktr, warangal tour, National Science and Technology Entrepreneurship .

వరంగల్, మార్చి 5 : వరంగల్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం‌ కృషి చేస్తుందని ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నేడు వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన.. వరంగల్ ఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇన్నోవేషన్ ఎక్స్ చేంజ్ సెంటర్‌ను డిప్యూటీ సీఎం‌ కడియం‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కినా అది సామాన్య ప్రజలకు ఉపయోగపడకపోతే బూడిదలో పోసిన పన్నీరులా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు.. ఇంజినీరింగ్, మెడిసిన్ విద్య అని కాకుండా తమ సృజనాత్మకతను చాటి చెప్పేలా కొత్త కొత్త ప్రయోగాలను ఆవిష్కరించాలన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. ఇంకుబేషన్ సెంటర్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.