వాట్సాప్‌ ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌‌’ అప్‌డేట్‌..

SMTV Desk 2018-03-05 17:15:16  wts app, new feature update, delete for everyone.

ముంబై, మార్చి 5 ‌: మనం పొరబాటుగా అనవసరమైన మెసేజ్‌లను ఇతరులకు పంపిస్తే వారు చూడకముందే “డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌” ద్వారా వాటిని తొలగించే సదుపాయం కల్పించింది వాట్సాప్‌. ప్రస్తుతం ఇలా మెసేజ్‌లను డిలీట్‌ చేయాలంటే ఏడు నిమిషాలలోపే చేసేయాలి. తాజాగా ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసినట్లు తెలుస్తోంది. మెసేజ్‌లను 7 నిమిషాల్లోపే కాకుండా గంట తర్వాత కూడా డిలీట్‌ చేసుకునేలా అప్‌డేటెడ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అప్‌డేట్‌ చేసిన ఫీచర్‌ ప్రకారం.. మనం పంపించిన మెసేజ్‌లను 68 నిమిషాల 16 సెకన్లలోపు వరకు డిలీట్‌ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ అప్‌డేటెడ్‌ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలోనే ఐఫోన్‌ యాప్‌లలోనూ తీసుకురావాలని వాట్సాప్‌ యోచిస్తోంది.