"విరుష్క" ఫోటోలు హల్‌చల్..

SMTV Desk 2018-03-05 16:43:46  team india captain, virat kohli, anushka.

ముంబై, మార్చి 5 : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్కల ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ కు కోహ్లీ విశ్రాంతి తీసుకున్నారు. మరోపక్క సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్న అనుష్క షూటింగ్ నిమిత్తం భోపాల్ నుండి ముంబై చేరుకుంది. ఈ నేపథ్యంలో భార్యను తీసుకొచ్చేందుకు విరాట్.. స్వయంగా ఎయిర్ పోర్టుకి వెళ్లాడు. అక్కడి నుండి వచ్చి కారులో కూర్చున్న వారు ఒకరికొకరు ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ముంబై చేరుకున్న భార్యను తీసుకుని విరాట్.. బోనీ కపూర్ కుటుంబాన్ని పరామర్శించారు.