ఇది ఆటో డ్రైవర్ నిర్వాకం!!!

SMTV Desk 2017-06-27 13:36:03  auto, draivar, kiss, girl

పుదుచ్చేరి, జూన్ 27 : రోజు రోజు కి ఆడవారి మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అడ్డు అదుపు లేకుండా కామందులు వారిపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. రోడ్డు పక్కన నిల్చున్న అమ్మాయిని ఒక ఆటో డ్రైవర్ ముద్దు పెట్టుకున్న ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. చెన్నై లో ఓ కార్పోరేట్ కంపనీ లో పనిచేస్తున్న ముగ్గురు అమ్మాయిలు విహార యాత్ర కోసం పుదుచ్చేరికి వచ్చారు. అక్కడే ఒక హోటల్లో రూమ్ తీసుకున్నారు. పర్యాటక ప్రదేశాలు తిరుగుతున్న అమ్మాయిలు రోడ్డు పక్కన నిల్చున్నారు. అప్పుడే ఒక ఆటో డ్రైవర్ వచ్చి అక్కడున్న అమ్మాయిని హఠాత్తుగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని పారిపోయాడు. వెంటనే ఆ అమ్మాయిలు ఆ ఆటో నెంబర్ రాసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ నంబర్ సహాయంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పనిని ఆ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో చేసినట్లు పోలీసులు వెల్లడించారు.