నితిన్‌, రాశీ ఖన్నాల పెళ్లి..!

SMTV Desk 2018-03-04 12:46:58  srinivasa kalyanam movie, motion poster released, nithin actor, rashi kanna actress

హైదరాబాద్, మార్చి 4 ‌: నితిన్‌, రాశీ ఖన్నాల పెళ్లి వీడియో బయటకు వచ్చింది. తెలుగులో సంప్రదాయబద్దంగా వారి వివాహం జరిగింది. ఇంతకీ పెళ్లి ఎక్కడ..? ఎప్పుడు జరిగిందనే కదా మీ సందేహం..! ఇదంతా రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ‘శ్రీనివాస కల్యాణం’. వేగేశ్న సతీశ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రబృందం సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. నితిన్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్‌లో నిజమైన దంపతుల్లా కన్పిస్తున్నారు. నందిత శ్వేత, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.