సీపీఐ పోస్టర్‌పై.. "వారియర్‌"

SMTV Desk 2018-03-03 15:58:32  priya prakash wariar , CPI, oru adhar love, CPI poster , social media

కేరళ, మార్చి 3 : సామాజిక మాధ్యమాలలో కన్ను గీటుతో సంచలం సృష్టించిన మళయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ . తాజాగా ఆమె ఫొటో ఇప్పుడు సీపీఐ పోస్టర్‌ మీద కూడా దర్శనమిస్తుంది. కేరళలోని మలప్పురంలో ఈనెల 1 నుంచి 4వరకు స్టేట్‌ కాన్ఫరెన్స్‌ను నిర్వహి౦చనున్నారు. ఇందులో భాగంగా ప్రచార నిమిత్తం పోస్టర్లను విడుదల చేశారు. ఈ పోస్టర్లను ‘ఒరు అదార్‌ లవ్‌’ చిత్రం పోస్టర్‌ మాదిరిగా డిజైన్‌ చేయించి దాని మీద ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ ఫొటో ముద్రించారు. సీపీఐకి చెందిన యూత్‌వింగ్‌ ఏఐఎస్‌ఎఫ్‌ తయారు చేయించించిన ఈ పోస్టర్‌ను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతికించారు. కేరళ రాష్ట్రంలో ఈ పోస్టర్లు వివాదంగా మారాయి. ‘ఒరు అదార్‌ లవ్‌’ చిత్రంలోని మాణిక్య మలరాయ పూవి పాటలో ఆమె హావభావాలు పలికించిన తీరు అందరిని ఫిదా చేసింది. దీ౦తో ప్రియా రాత్రికి రాత్రే స్టార్దమ్‌ తెచ్చుకున్న విషయం తెలిసిందే.