"జియోఫై" పై బంపర్ ఆఫర్‌..

SMTV Desk 2018-03-03 14:23:13  reliance jio, jiofi, 4g hotspot,

న్యూఢిల్లీ, మార్చి 3 : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. ఆరంభం నుంచే ఆఫర్లతో అదరగొడుతూ ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో వినియోగదారుల ముందుకు వస్తోంది. తాజాగా జియో తన జియోఫై హాట్‌స్పాట్ డివైస్‌ను కొనుగోలు చేసిన వారికి మరో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. జియోఫైని కొనుగోలు చేయడం ద్వారా రూ.3,595 విలువల గల ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది. 1,999 జియోఫై 4జీ హాట్‌స్పాట్‌ కొనుగోలు చేసిన వారికి రూ.1,295 విలువ గల డేటా, రూ.2,300 విలువైన ఓచర్లను పొందవచ్చు. వీటిని పేటీఎం, ఆజియో, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో వాడుకుని యూజర్లు డిస్కౌంట్‌ను పొందవచ్చు. కాగా జియోఫై ధర రూ.999 మాత్రమే ఉన్నప్పటికీ దాన్ని రూ.1,999 తో మాత్రమే కొనుగోలు చేస్తే పైన చెప్పిన ఆఫర్ లభిస్తుంది. ఒక వేళ ఈ ఆఫర్‌ వద్దనుకునే వారికి రూ.999కే జియోఫై లభించనుంది.