సిరియాలో ఆగని మారణహోమం..

SMTV Desk 2018-03-03 13:46:42  ghouta, siriya civil war, damaskas, uno

డమస్కస్‌, మార్చి3 : సిరియాలో జరుగుతున్నా మారణహోమం ఇంకా ఆగలేదు. అంతర్జాతీయ సమాజం నిబంధనలను పెడచెవిన పెడుతూ, ఐక్యరాజ్యసమితి ఆదేశాలను వినకుండా సిరియా సైన్యం మరోసారి వైమానిక దాడులు చేసింది. తూర్పుగౌటాలోని ఇళ్లపై, శుక్ర, శనివారాల్లో బాంబుల మోత మోగించింది. ఈ ఘటనలో 25 మందికిపైగా పౌరులు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం తూర్పు గౌటాలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలు ఏజెన్సీలు ఈ విషయాన్ని తెలిపాయి. ఫిబ్రవరి చివరి వారంలోగా కాల్పులు విరమించాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సిరియా-రష్యాలను ఆదేశించింది. అయినప్పటికీ సిరియా మరోసారి బాంబుల వర్షం కురిపించింది.