డయాబెటిస్ వల్ల పెరుగుతున్న కిడ్నీ రోగులు: కేటీఆర్

SMTV Desk 2018-03-03 12:45:02  diabetommics medical company, diabetic, minister KTR, medhak

మెదక్, మార్చి 3 : డయాబెటిస్ వల్ల కిడ్నీ రోగులు పెరుగుతున్నారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని ముప్పిరెడ్డిపల్లిలో డయాబెటోమిక్స్ మెడికల్ కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఉమ్మిని పరీక్షించి షుగర్ లెవల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకునే పరికరాన్ని శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి తీసుకొచ్చారని తెలిపారు. దీనికి పెద్ద పెద్ద పారిశ్రామిక వర్గాలు పెట్టుబడులకు ముందుకు వచ్చి ఈ తోడ్పాటు అందిస్తున్నారు. వైద్య పరీక్షలంటే సామాన్యులు భయపడుతున్నారని, ముందుగా గుర్తిస్తే ఏ వ్యాధినైనా తగ్గించుకోవచ్చని చెప్పారు. దేశంలో 7.2 కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారు. అందుకే వైద్య పరీక్షలకు భయపడకుండా.. ముందస్తు పరీక్షలు చేయించుకుంటే ఏ వ్యాధినైనా అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు.