కేరళ ముఖ్యమంత్రికి అస్వస్థత..

SMTV Desk 2018-03-03 12:39:44  kerala cm, pinarai vijayan, health issue, tiruvanathapuram.

తిరువనంతపురం, మార్చి 3 : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను తెల్లవారుజామున చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు ప్రస్తుతం యూరాలజిస్ట్ నేతృత్వంలో వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాని ఇప్పటివరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి ప్రకటనను తెలియజేయలేదు. ఈ విషయంపై స్పందించిన సీఎంవో వర్గాలు.. ముఖ్యమంత్రి ఎప్పటిలాగానే వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్ళినట్లు స్పష్టం చేశాయి. సీఎం విజయన్ రేపు కేరళకు తిరిగి వస్తారని భద్రతా సిబ్బంది వెల్లడించింది.