నేటి నుంచి అజ్లాన్‌ షా కప్‌..

SMTV Desk 2018-03-03 11:41:07  Sultan Azlan Shah Cup, india, Argentina, malasiya

మలేషియా, మార్చి 3 : సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ లో భారత్ జట్టు, ప్రపంచ రెండో ర్యాంకర్ అర్జెంటీనాతో తలపడనుంది. సర్దార్‌ సింగ్‌ సారథ్యంలో అజ్లాన్‌ షా కప్‌లో భారత్‌ ఒక్కసారి కూడా పతకం లేకుండా తిరిగి రాలేదు. 2008లో అతడి సారథ్యంలోనే రజత పతకం కైవసం చేసుకున్న భారత్‌.. 2015, 2016లో కాంస్య, రజత పతకాలు చేజిక్కించుకోవడం విశేషం. అదే సెంటిమెంట్ ను కొనసాగించి ఈసారీ పతకం నెగ్గాలనే లక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగుతోంది.