త్రిపురలో వికసిస్తున్న కమలం..

SMTV Desk 2018-03-03 11:11:56  tripura, bjp, cpm. election result-2018

త్రిపుర, మార్చి 3 : మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. వీటిలో త్రిపురలో కంచుకోటగా ఉన్న వామపక్ష కూటమికి జాతీయ పార్టీ బీజేపీ గట్టి పోటీనిస్తుంది. 20 ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న మాణిక్ సర్కార్ ఈ సారి గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత కౌంటింగ్ ప్రకారం బీజేపీ 35 స్థానాల్లో ముందజలో ఉండగా, వామపక్షకూటమి 24 సీట్ల లీడ్ లో ఉంది. కాగా రాష్ట్రంలో మొత్తం 60 స్థానాలకుగాను 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 31.