ఈశాన్య భారతంలో కొనసాగుతున్న కౌంటింగ్

SMTV Desk 2018-03-03 10:46:57  tripura, nagaland, meghalaya, elections results

న్యూఢిల్లీ, మార్చి 3 : ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు భారీ భద్రత మధ్య ప్రశాంతగా జరుగుతుంది. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుత లెక్కింపు ప్రకారం త్రిపురలో సీపీఎం పార్టీకి జాతీయ పార్టీ అయిన భాజాపా గట్టి పోటీనిస్తుంది. ఇక మేఘాలయాలో మాత్రం కమలం పార్టీ వెనుకబడిపోయింది. నాగాలాండ్‌లోనూ భాజపా కూటమి పార్టీ అయిన ఎన్‌డీపీపీ ఆధిక్యంలో ఉంది.