పాక్ లో చైనా ఖైదీలు..

SMTV Desk 2018-03-02 18:43:55  cpec, Chinese prisoners, CPEC project, pakistan

ఇస్లామాబాద్‌, మార్చి 2 : పాక్ భూభాగంలో చైనా దేశం అభివృద్ధి ప్రాజెక్ట్ లు చేపడుతున్న విషయం తెలిసిందే. చైనా దేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా-పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌(సీపెక్‌) ప్రాజెక్ట్ లో చైనా ఖైదీలు పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పాక్‌ పార్లమెంట్‌ సభ్యుడొకరు తెలిపారు. దీంతో పాక్, డ్రాగన్ దేశం మధ్య సత్ససంబంధాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఖైదీలను ఉపయోగించుకోవడం సాధారణమే అయిన చైనా నుండి ఖైదీలను పాక్‌కు తీసుకురావడం కాస్త ఆశ్చర్యకరంగా ఉందని యూసఫ్‌ అన్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ఖైదీలను తీసుకురావడం అంటే మామూలు విషయం కాదని.. దీని గురించి ఇరు దేశాల మధ్య రహస్య ఒప్పందం ఏదైనా జరిగి ఉంటుందని యూసఫ్‌ వెల్లడించారు.