కోవూరులో సైకో హల్ చల్..

SMTV Desk 2018-03-02 15:53:17  kovuru, psycho, nellore, nayaa bramhana street

కోవూరు, మార్చి 2 : నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో ఓ సైకో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఒంటరి మహిళలే లక్ష్యంగా పలు ప్రాంతాల్లో దాడులు చేసి పలువురిని గాయపరిచి హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో నాయీ బ్రాహ్మణవీధిలో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై దాడి చేసి అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన మహిళను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికులు మహిళ కేకలు విని అతడిని పట్టుకోవడానికి యత్నించగా పారిపోయాడు. ఆబోతువారి వీధికి చెందిన అంగమ్మ అనే వృద్ధురాలిపై ఆయుధంతో దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. వృద్ధురాలిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పోలీసులు, క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాల వారిగా ప్రయత్నాలు చేస్తున్నారు.