కేసీఆర్ మాటల్లో పొరపాటు దొర్లింది : కవిత

SMTV Desk 2018-03-02 15:48:17  mp kalvakuntla kavitha, comments on kcr, hyderabad.

హైదరాబాద్, మార్చి 2 : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు పార్లమెంట్ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నట్లు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రాల విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఆశాజనకంగా లేదన్న కవిత.. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి ఏర్పడ్డ లోటును సైతం కేంద్రమే పూరించాలన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన కవిత.. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీని కించపర్చే ఉద్దేశంతో మాట్లాడలేదని.. ఆయన మాటల్లో పొరపాటు దొర్లిందని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాద్దాంతం చేయడం సరికాదన్నారు.