ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు : రఘువీరారెడ్డి

SMTV Desk 2018-03-02 14:42:40  pcc chief raghuveera reddy, protest on ap special status, vijayawada.

విజయవాడ, మార్చి 2 : ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం చేస్తున్న వారిని ఇలా అమానుషంగా అరెస్ట్ చేయడం అన్యాయమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రత్యేక హోదా కావాలని కోరుతూ కడప-తిరుపతి జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ నాయకులు.. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నాయకులతో పాటు అధ్యక్షుడు రఘువీరారెడ్డిని సైతం అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో జాతీయ రహదారి వాహనాలతో స్తంభించింది. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. తన కేసుల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు.