ఆ జోడి ఉండటంలో తప్పు లేదు : కపిల్‌దేవ్‌

SMTV Desk 2018-03-02 13:58:47  kapil dev, comments indian skipper, kohli, dhoni

న్యూఢిల్లీ, మార్చి 2 : టీమిండియా క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి దూకుడు స్వభావం, మహేంద్ర సింగ్ ధోని ప్రశాంతత 2019 ప్రపంచకప్‌ దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.." వచ్చే ప్రపంచకప్‌లో భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ దూకుడు, ధోని ప్రశాంతత ప్రపంచ కప్ సాధించేందుకు ఎంతో దోహదపడతాయి. ఇలాంటి జోడి ఉండటంలో తప్పులేదు. జట్టులో అందరూ దూకుడు ప్రదర్శించే ఆటగాళ్లు ఉన్నాఅది ప్రమాదమే. అలాగని అందరూ ప్రశాంతంగా ఉన్నా కష్టమే. అందుకే ఈ రెండు కలిసి ఉండాలి. ఇది జట్టుకు ఎంతో లాభిస్తుంది" అని కపిల్‌ వ్యాఖ్యానించాడు.