రేపు తెరాస పార్లమెంటరీ సమావేశం..

SMTV Desk 2018-03-02 12:59:54  parliamentary meeting, tomorrow started, kcr, trs mps.

హైదరాబాద్, మార్చి 2 : కేసీఆర్ అధ్యక్షతన రేపు సాయంత్రం నాలుగు గంటల సమయంలో తెరాస పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈ నెల ఐదవ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ వ్యవహరించాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా కేంద్ర౦ వద్ద అసంపూర్తిగా ఉన్న సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన అంశాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు సైతం ఆహ్వానం అందించారు.