జియోకి ధీటుగా ఎయిర్‌టెల్‌ 995 ప్లాన్..

SMTV Desk 2018-03-02 12:23:00  jio, airtel, 995 plan, Truly Unlimited Voice Calls

న్యూఢిల్లీ, మార్చి 2 : ప్రస్తుత టెలికాం రంగంలో జియో పథకాల నుండి వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు కంపెనీ లు వరుస ఆఫర్లును ప్రవేశపెడుతున్నాయి. తాజాగా ప్రముఖ టెలికాం రంగ సంస్థ అయిన ఎయిర్‌టెల్‌ రూ.995 రీఛార్జి ఆఫర్‌ను ప్రకటించింది. జియో రూ.999 ప్లాన్‌కు పోటీగా ఈ ఆఫర్ ను వెల్లడించింది. 180 రోజుల కాలపరిమితితో కూడిన ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులు అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చు. రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. మొత్తం ఆరు నెలల కాలంలో నెలకు 1జీబీ 3జీ/4జీ చొప్పున డేటా పొందవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ ప్రకటించిన రూ.995 రీఛార్జి ఆఫర్‌లో డేటా తక్కువగా ఇచ్చినా, అపరిమిత కాల్స్‌ ఆరునెలల కాలపరిమితిలో ఉండటంతో వినియోగదారులను ఆకర్షించవచ్చని సంస్థ భావిస్తుంది. జియో గతంలోనే రూ.999 రీఛార్జి పథకాన్ని ప్రకటించింది. అందులో 90 రోజుల వరకూ అపరిమితకాల్స్‌, 60జీబీ డేటా, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు యూజర్లు వాడుకోవచ్చు.