మార్చి 2 నుండి మూగాబోనున్న ధియేటర్లు..

SMTV Desk 2018-02-28 17:08:57  hyderabad, bandh, digital service providers, south indian film committee

హైదరాబాద్, ఫిబ్రవరి 28 : మార్చి 2 నుండి వెండి తెర మూగబోనుంది. డిజిటల్‌ సర్వీస్ ప్రొవైడర్స్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా సినీ పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌, పంపిణీదారులు, మార్చి 2 నుండి బంద్ పాటించనున్నారు. ఈ విషయాన్ని దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఈ బంద్ కు సినిమా అభిమానులు, ప్రేక్షకులు, సహకరించాలని వారు కోరారు. గతవారం సినిమా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు క్యూబ్‌, యూఎఫ్‌ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో వేలాది సినిమా ధియేటర్లు మూగబోనున్నాయి.