ఈ అంతర్యుద్ధానికి అంతం ఎప్పుడు..

SMTV Desk 2018-02-28 15:17:52  syria, Ghouta civil war, damaskas, west asia

డమాస్కస్, ఫిబ్రవరి 28 : సిరియాలో ఏడేళ్ల అంతర్యుద్ధం తీవ్రమై ప్రస్తుతం ఆపార ప్రాణనష్టం కలిగిస్తుంది. రాజధాని డమాస్కస్ తూర్పు తీరంలోని గౌటలో గత వారం జరిగిన మారణహోమం ప్రస్తుతం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలచివేస్తుంది. అగ్రరాజ్యాలు ఇప్పటికైనా శాంతించి శాంతి స్థాపనకు ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు. పశ్చిమ ఆసియాలో ఉన్న సిరియా అంతర్యుద్ధ కారణంగా మరణించిన వారిలో 200 మంది చిన్నారులు, 110 మంది మహిళలు కూడా ఉన్నారు. వైమానిక దాడుల్లో ఆస్పత్రి భవనాలు, వందకొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. ముందు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తర్వాత దాడి చేయవలిసిన ప్రభుత్వ బలగాలు నిర్దాక్షణ్యంగా జనావాసాలపై బాంబులు జారవిడుస్తున్నాయి. దేశ రాజధాని డమస్కస్‌ శివారు నగరమైన గౌటా 2013లో ప్రభుత్వ బలగాల నీడలో ఉంది . అయితే మిగతా ప్రాంతాల్లో చావుదెబ్బతిన్న మిలిటెంట్లు చాలా మంది సాధారణ జనంతో కలిసిపోయి గౌటా నగరంలో తలదాచుకున్నారు. 2017నాటికి వారు తిరిగి ఆయుధ సంపత్తిని దక్కించుకొని గౌటాలో సొంత పెత్తనం చెలాయించే స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం తిరుగుబాటు దళాలు గౌటా నగరాన్ని రొట్టెను పంచుకున్నట్లు పంచుకున్నాయి. తహ్రీర్‌ అల్‌ షమ్‌, అల్‌ రహమాన్‌ లీజియన్‌, జైష్‌ అల్‌ ఇస్లామ్‌ అనే గ్రూపులు తమలోతాము కలహించుకుంటూ, ప్రభుత్వ బలగాలతోనూ తలపడుతూ ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన కొన్ని చిత్రాలు సామాజిక మాధ్యమాల వేదికగా చాలా మంది పంచుకుంటున్నారు. అంతే కాకుండా ‘ప్రే ఫర్‌ సిరియా’ (సిరియా కోసం ప్రార్థించండి) అంటూ ట్వీట్ లు చేస్తున్నారు. సిరియాలో ఛిన్నాభిన్నామైపోతున్న బాల్యాన్ని కాపాడాలని, మానవత్వాన్ని చూపాల ని, అక్కడి చిన్నారులకు కూడా అందరి బాలల్లాగే సంతోషంగా బతికే హక్కు కల్పించాలని, ఈ దిశగా ప్రపంచ దేశాల్ని కదిలించాలని కోరుతూ ఈ హాష్‌ట్యాగ్‌ ఉద్యమం నడుస్తోంది. ముఖ్యంగా చిన్నారుల మరణాలుపై ప్రతిఒక్కరు స్పందిస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.