ముగిసిన నాగాలాండ్, మేఘాలయ పోలింగ్

SMTV Desk 2018-02-28 14:37:34  nagaland, meghalaya, poling, completed

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 : ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లో నిన్న జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్టాలలో కలిపి 75% పోలింగ్‌ నమోదైంది. నాగాలాండ్‌లో అకులుటో నియోజకవర్గం జున్‌హెబోటో జిల్లాలో నాగా పీపుల్స్‌ ఫ్రంట్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారని చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ అభిజిత్‌ సిన్హా తెలిపారు. మోన్‌ జిల్లా టిజిట్‌ నియోజకవర్గంలోని ఓ గ్రామంలోని పోలింగ్‌ స్టేషన్‌ సమీపంలో బాంబు పేలి ఒకరు గాయపడ్డారని చెప్పారు. సుధోస్డు, లాడిగఢ్‌లో పోలింగ్‌ స్టేషన్‌ల వద్ద ఉద్రిక్తతల కారణంగా ఎన్నిక నిలిపివేసినట్లు వివరించారు.మేఘాలయలో పోలింగ్ ప్రశాతంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 18 న జరిగిన త్రిపుర ఎన్నికలతోపాటు మేఘాలయ, నాగాలాండ్‌ ఓట్ల లెక్కింపు వచ్చే నెల 3న చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.