విరాట్... దూకుడు అన్ని వేళలా పనికిరాదు : స్టీవ్‌ వా

SMTV Desk 2018-02-28 11:31:12  virat kohli, Steve Waugh, Indian Skipper, australia

మొనాకో, ఫిబ్రవరి 28 : విరాట్ కోహ్లి... మైదానంలో పాదరసంలా కదులుతాడు.. ప్రత్యర్ధులు ఎవరైనా కవ్విస్తే అంతే వేగంతో బ్యాటుతో, నోటితో సమాధానం చెప్పే మిస్సైల్.. అందుకే చాలా మంది మాజీ ఆటగాళ్లు ఆటలో భాగంగా విరాట్ ని రెచ్చగొట్టవద్దని చెబుతారు.. అయితే ఈ దూకుడు స్వభావంపై ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌ వా స్పందించారు. అన్ని వేళలా భారత్ కెప్టెన్ కోహ్లికు దూకుడు పనికిరాదని ఆయన అన్నారు “కెప్టెన్‌గా అతడు కోహ్లి ఎదిగే క్రమంలోనే ఉన్నాడు. ఉత్సాహాన్ని, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి అతడికి మరికొంత సమయం కావాలి. అయినా విరాట్‌ అంటేనే దూకుడు. అతడు ఆటను అలాగే ఆడతాడు. కొన్నిసార్లు నియంత్రించుకోవాలి. కొన్ని సార్లు పెంచాలి. ఎప్పుడు ఏది సరైందన్న సంగతిని గుర్తించాలి. జట్టులో అందరూ అతడిలా ఆడలేరన్న సంగతిని తెలుసుకోవాలి. ఆటగాడిగా కోహ్లి అంటే నాకు ఎంతో గౌరవముంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు కోహ్లినే కీలకం’’ అని స్టీవ్ వా వివరించాడు.