స్పోర్ట్స్‌ క్లబ్‌ కు శ్రీదేవి భౌతికకాయ౦..

SMTV Desk 2018-02-28 10:27:29  SRIDEVI DEAD BODY, IN CELEBRITY SPORTS CLUB, MUMBAI.

ముంబై, ఫిబ్రవరి 28 : శ్రీదేవి భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ముంబై చేరుకుంటున్నారు. శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె నివాసం నుండి అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉన్న సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ (గార్డెన్‌ నంబర్‌ 5) తరలించారు. అభిమానుల సందర్శనార్థం నేటి ఉదయం 9.30 గంటల నుండి 12.30 గంటల వరకు పార్థవదేహాన్ని స్పోర్ట్స్ క్లబ్‌లో ఉంచనున్నారు. అనంతరం అక్కడి నుండి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబైలోని విలేపార్లే సేవాసమాజ్‌ హిందూ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి నివాసం, క్లబ్‌ పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.