12 నుండి ‘108’ఉద్యోగుల సమ్మె

SMTV Desk 2018-02-27 18:49:24  108, employees, demands, strike, hyderabad

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 : ఆపదలో ఉన్నవారిని రక్షించేందుకు ఠక్కున స్పందించే 108 వాహన ఉద్యోగులకు తమ సమస్యలను పరిష్కరించడానికి ఆదుకునే వారేలేరు. తమ పనులను సైతం లెక్కచేయకుండా రాత్రి పగలు ప్రమాదంలో ఉన్నవారికి అత్యవసర సమయంలో సేవలు అందిస్తారు. 4రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 108 ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతున్నారు. అత్యవసర సేవలు కావడంతో నిరసన తెలుపుతూనే విధులు నిర్వర్తిస్తున్నారు. తమ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు వెళుతున్నట్లు 108 ఉద్యోగులు చెబుతున్నారు. మార్చి 12నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం ప్రకటించింది. రోజుకి 12 గంటల పనిచేస్తున్నా 13ఏళ్లుగా వారి వేతనం 13000 కంటే పెరగడం లేదు. కొత్తగా చేరినవారికిచ్చే జీతం రూ.4450 మాత్రమే. తమ సమస్యలకు పరిష్కారం లభించకపోతే మార్చి 2న సమ్మె నోటీసివ్వాలని ఉద్యోగులు నిర్ణయించారు.