అంతర్జాతీయ క్రికెట్‌ కు బైబై చెప్పనున్న మోర్కెల్..

SMTV Desk 2018-02-27 10:19:38  morne morkel, retirement news, south africa, bowler

జోహాన్స్ బర్గ్, ఫిబ్రవరి 27 : సౌతాఫ్రికా పేస్ వీరుడు, ఆరుఅడుగుల పొడగరి మోర్ని మోర్కెల్ అంతర్జాతీయ క్రికెట్ బైబై చెప్పనున్నాడు. సఫారీ జట్టు త్వరలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుండి ఆయన వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అవిరామ౦ లేకుండా సాగుతున్న క్రికెట్ వల్ల కుటుంబానికి తగిన సమయం కేటాయించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోర్కెల్ వెల్లడించారు. ఇంతకాలంగా తనకు అండగా నిలిచి ఆదరించిన క్రికెట్‌ సహచరులు, కుటుంబసభ్యులకు మోర్కెల్‌ కృతజ్ఞతలు తెలిపాడు.