రాజకీయ సైన్యం ఎంపికకు జనసేనా కసరత్తు..

SMTV Desk 2017-05-29 11:34:30  pavankalayn,janasena,election

హైదరాబాద్, మే 28 : ముందస్తు ఎన్నికల వ్యూహాలను అమలు చేసేందుకు అధికారపార్టీలు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో, జనసేన పార్టీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఆంధ్రపదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఆ పార్టీ బాధ్యులను ఎంపిక ప్రక్రియలు మెుదలు పెట్టి జనపథానికై వేస్తున్న అడుగుల సవ్వడి జోరందుకుంది. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్తులు, విశ్లేషకులు, రచయితలను ఎంపిక చేసేందుకు కసరత్తును ప్రారంభించింది. ప్రతిభ చూపిన వారిని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యులుగా ఎంపికచేసే అవకాశం ఉంది. నగర శివారు మేడ్చల్ జిల్లాలోని కొంపల్లి ఇందుకు వేదికైంది. ఈనెల 23 నుండి 25 వరకు ఎంపిక ప్రక్రియలుకొనసాగించనున్నారు. సుమారు 4, 500 మంది యువతి యువకులు తమ పేర్లను నమోదు చేసుకోని ఎంపిక ప్రక్రియలో పాల్గొంటున్నారు. మహిళల భద్రత, నగర ట్రాఫిక్ సమస్య, కాలుష్యం, ధర్నాచౌక్, రోడ్డు ప్రమాదాలు, దేశంలో ప్రాంతీయ తత్వం తదితర అంశాలపై ఇంటర్వ్యూలో భాగంగా వేదికపై ప్రసంగించడం, లేదా 45 నిమిషాల పాటు పరీక్ష వ్రాయాల్సి ఉంటుంది. తొలిరోజు వెయ్యి మంది, రెండవ రోజైన గురువారం 800 మంది హాజరయ్యారు.