చంద్రబాబుకు పలువురు నేతల అభినందనలు..

SMTV Desk 2018-02-26 13:38:17  chandrababu naidu, leaders congratulate, vishakapatnam.

విశాఖపట్నం, ఫిబ్రవరి 26 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవిత౦లో నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం చంద్రబాబు సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలోనే మంత్రులతో కాసేపు భేటీ అయ్యారు. రాజకీయంగా చంద్రబాబు మరింత కాలం పని చేయాలంటూ ఆకాంక్షిస్తూ.. మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.