శ్రీదేవి ఎంతోమందికి ఆదర్శం : ఎమ్మెల్యే రోజా

SMTV Desk 2018-02-25 15:43:41  actress sridevi, passed away, roja comments, ysrcp, tirumala

తిరుమల, ఫిబ్రవరి 25 : అతిలోక సుందరి, నటి శ్రీదేవి గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో యావత్ భారత సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. చాలా మంది ప్రముఖులు, నటి శ్రీదేవితో తమకున్న మరుపురాని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏడు కొండలవాడిని దర్శించుకున్న తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీదేవిని ఆదర్శంగా తీసుకుని అనేకమంది సినిమాల్లో నటించటానికి వచ్చారని, అందులో తానూ ఒకరినని చెప్పారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.