ఇండియా @ 81..

SMTV Desk 2018-02-23 12:05:19  india, corruption, transparency international-2017, newzealand

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 : ఇండియాలో అవినీతి బాగా పెరిగిపోయిందని ఓ నివేదిక వెల్లడించింది. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, పత్రికా స్వేచ్ఛ ఆధారంగా ర్యాంకులు కేటాయించింది. మొత్తం 180 దేశాలలో అవినీతి ఎలా ఉందో అధ్యయనం చేసి ఆయా దేశాలకు 0 నుంచి 100 వరకు స్కోర్‌ ఇచ్చింది. 2017 ఏడాది భారత్ 40 స్కోర్ తో 81వ స్థానంలో ఉంది. 2016లో మనదేశం ఇదే స్కోర్ తో 79వ స్థానంలో నిలిచింది. అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలుగా న్యూజిలాండ్‌ (89), డెన్మార్క్‌ (88) మొదటి, ద్వితీయ స్థానాలు దక్కించుకున్నాయి.