పీఎన్‌బీ కు విరాట్ గుడ్ బై చెప్పనున్నాడా..!

SMTV Desk 2018-02-21 15:42:41  pnb, brand ambassdor, virat kohli, neerv modi,

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 : పీఎన్‌బీ (పంజాబ్ నేషనల్ బ్యాంక్) కు రూ. 11, 400 కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా పేరుగాంచిన ఈ ఘటనలో ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు తమ సోదాలను కొనసాగిస్తున్నాయి. కాగా ప్రస్తుతం పీఎన్‌బీ బ్యాంకు కు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న భారత్ క్రికెట్ సారథి విరాట్ కోహ్లి తెగతెంపులు చేసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ మెగా స్కాం వల్ల బ్యాంకు కు చెడ్డపేరు రావడంతో ఆ బ్యాంకు కు కోహ్లి గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది.