సీపెక్‌ ప్రాజెక్ట్‌లపై దాడులు చేయవద్దు : చైనా

SMTV Desk 2018-02-20 14:30:47  cpec project, chaina, militants in Balochistan, financial time

బీజింగ్‌, ఫిబ్రవరి 20 : చైనా- పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపెక్‌) భద్రత విషయంలో చైనా బలూచిస్థాన్‌ ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతోందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ నివేదిక వెల్లడించింది. సీపెక్‌ లో భాగంగా ఉన్న ప్రాజెక్ట్‌లపై దాడులు చేయవద్దని చైనా ఉగ్రవాదులను కోరినట్లు పాక్ కు చెందిన ఓ అధికారి తెలిపారు. చైనా నిర్మించ తలపెట్టిన చైనా- పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపెక్‌) ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు భారత్‌ ప్రణాళికలు రచిస్తోందని పాకిస్థాన్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీపెక్‌ రూట్లో దాడులు జరిగే అవకాశముందని హెచ్చరిస్తూ పాక్‌ హోం మంత్రిత్వ శాఖ.. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ హోంశాఖకు లేఖ రాసింది.