కేసీఆర్ పై అరవింద్ సుబ్రమణ్యన్ ప్రశంసల జల్లు..

SMTV Desk 2018-02-20 13:49:12  cm kcr, aravind subramanyan, pragathi bhavan, meeting.

హైదరాబాద్, ఫిబ్రవరి 20 : కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా రెండు గంటల పాటు కేసీఆర్ తో భేటీ అయి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ భేటీలో భాగంగా నేరుగా రైతులకు నగదు బదిలీ, గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్లు సహా పలు అంశాలు, అత్యంత విలువైన అంశాలపై చర్చించినట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా సుబ్రమణ్యన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రైతులకు పెట్టుబడి సాయం అందించడం గొప్ప నిర్ణయమని కేసీఆర్ ను కొనియాడుతూ.. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.