ఆ మాటల్లో వాస్తవం లేదు : దీప

SMTV Desk 2018-02-20 12:15:03   MGR Amma Deepa Peravai, Deepa Jayakumar, tamilnadu, aiadmk

చెన్నై, ఫిబ్రవరి 20 : తమిళనాడులో మహిళలకు స్వేచ్ఛ ఇవ్వకపోవడంతోనే రాష్ట్రం ఇంకా వెనుకబడి ఉందని ఎంజీఆర్‌ అమ్మా దీప పేరవై ప్రధాన కార్యదర్శి జె.దీప అన్నారు. ఓ తమిళ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పలు విషయాలు తెలిపారు. అన్నాడీఎంకేలో తన వర్గం విలీనం గురించి ఇప్పుడేమీ చెప్పలేనని, తన భర్త మాధవన్‌ ఇంటి నుంచి వెళ్లిపోయి 4 రోజులు అయిందని,ఇలా అప్పుడప్పుడు జరుగుతుందని వెల్లడించారు. తన మేనత్త జయలలిత కూడా శశికళ నియంత్రణలో ఉందని చెప్పడం వాస్తవం కాదని వ్యాఖ్యానించారు. శశికళ నాయకత్వాన్ని అంగీకరించలేక, అన్నాడీఎంకేకు ఓ వారసులు కావాలనే ఉద్దేశంతోనే పలువురు తన ఇంటి ఎదుట నిలిచారని పేర్కొన్నారు.