విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

SMTV Desk 2018-02-19 13:39:44  jfc meeting, pawan kalyan, hyderabad, sub committees

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 : రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం అందించిన నిధుల విషయంలో రాష్ట్ర, కేంద్ర ఇస్తున్న ప్రకటనలో ఏర్పడ్డ అనుమానాలను నివృత్తి చేసేందుకు జనసేన ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీ(సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ) సమావేశాలకు విజయవంతం చేసిన వారందరికీ ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో లోతైన చర్చలు పారదర్శకంగా జరిగాయన్నారు. న్యాయకోవిదులు, ప్రజాపరిపాలనలో అనుభవజ్ఞులు, రాజకీయాల్లో అనుభవం ఉన్న ప్రజానేతలు తెలుగు ప్రజలకు మేలు జరగాలన్న బలమైన కోరికతో సమావేశాల్లో పాలు పంచుకోవడం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని పేర్కొన్నారు. జేఎఫ్‌సీ కొన్ని ఉపకమిటీలను నియమించిందని వారి వివరాలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని వ్యాఖ్యానించారు.