టీ-20 ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన కంగారులు..

SMTV Desk 2018-02-16 16:44:03  australia, newzealand, world record, t-20, warner

ఆక్లాండ్, ఫిబ్రవరి 16 : ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు ను లిఖించింది. కివీస్ జట్టుపై అత్యధిక పరుగుల లక్ష్యాన్నిఆసీస్ ఛేదించి చరిత్ర సృష్టించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(105), కోలిన్ మన్రో (76) వీరవిహారం చేయడంతో కివీస్ 243 పరుగులు చేసింది. అనంతరం 244 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టులో షార్ట్‌ (76), వార్నర్‌ (59), ఫించ్‌ (36), మాక్స్‌వెల్‌ (31), పరుగులతో రాణించారు. దీంతో మరో ఏడు బంతులు మిగిలుండగానే కంగారుల జట్టు లక్ష్యాన్ని చేరుకుంది. 2015లో విండీస్ జట్టు దక్షిణాఫ్రికా విధించిన 232 పరుగుల విజయ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన కాగా, ఇప్పుడా ఆ రికార్డును ఆస్ట్రేలియా బద్దలుకొట్టింది.