జేఎఫ్ఎఫ్ పై మాకు నమ్మకం లేదు : హరిబాబు

SMTV Desk 2018-02-16 16:21:26  bjp mp, kambampati haribabu, jff, pawan kalyan

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 : కేంద్ర సాయంపై మరో 18 పేజీల నోట్ ను శుక్రవారం దిల్లీలో ఏపీ భాజపా అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీపై తమకు నమ్మకం లేదన్నారు. రైల్వేజోన్‌పై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంస్థల ఏర్పాటుకు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా కేంద్రం వాటిని ఏర్పాటు చేస్తూ వస్తోందని హరిబాబు వెల్లడించారు. సాధ్యంకాని వాటి విషయంలో ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు.