దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్‌ జుమా రాజీనామా..

SMTV Desk 2018-02-15 11:39:22  zacob zuma- resign, south africa, anc party

జోహెన్నెస్‌బర్గ్, ఫిబ్రవరి 15 ‌: సౌతాఫ్రికా అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్(ఏఎన్‌సీ)‌ పార్టీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో జాకోబ్‌ జుమా గురువారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా విషయాన్ని జుమా నేషనల్‌ టెలివిజన్‌ ప్రసారంలో వెల్లడించారు. ఉప అధ్యక్షుడు సైరిల్‌ రమాఫోసాను జుమా స్థానంలో నియమించాలని ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్ నిర్ణయించింది. ఏఎన్‌సీ పార్టీ సోమవారం సమావేశమై జుమాను రాజీనామా చేయాల్సిందిగా కోరగా, ఆయన రాజీనామాకు ససేమిరా అన్నారు. పార్టీ ఆదేశించిన మూడు రోజుల అనంతరం నేడు ఆయన పదవి నుండి తప్పుకున్నారు. భారీ అవినీతి, దేశ ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం తదితర కారణాలు జుమాపై వ్యతిరేకత ఎక్కువ కావటానికి కారణాలు అయ్యాయి.