రవితేజ తమ్ముడి దుర్మరణం

SMTV Desk 2017-06-25 13:13:09  film actor, ravitej, brother, bharath

హైదరాబాద్, జూన్ 25 : రోడ్డు ప్రమాదంలో మరో నటుడు మృతి చెందాడు. ఇంతకు ముందు ఇలాగె నటులు బాబు మోహన్, కోట శ్రీనివాస్ రావు, హరికృష తనయులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కోత్వాల్ గూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు భరత్ మృతి చెందాడు. హీరో రవితేజ సోదరుడు భరత్ అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచేయి వంటి చిత్రాల్లో నటించాడు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. భరత్ కారును వేగంగా వెళ్లి అగి ఉన్న లారీని ఢీ కొనడంతో భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. భరత్ వేసుకొచ్చిన స్కోడా కారు నెం (టీఎస్ 09 ఈసీ 0799) నెంబర్ గల కారు కు ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.