చెల్లెలు కవితకు ధన్యవాదాలు : పవన్

SMTV Desk 2018-02-10 12:19:03  janasena party, pawan kalyan, trs mp kalvakuntla kavitha, twitter.

హైదరాబాద్, ఫిబ్రవరి 10 : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా ఏపీ ఎంపీలు విభజన హామీలు అమలు చేయాలంటూ నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఎంపీ కవిత ఈ విషయాన్ని లోక్‌సభలో ప్రస్తావిస్తూ.. ఆంధ్రాకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో పవన్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా స్పందిస్తూ.. "రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని లోక్‌సభలో మద్దతు తెలిపిన చెల్లెలు కవితకు హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ ట్వీట్‌ చేశారు.