ప్రదీప్ ట్వీట్‌కు.. మంత్రి రీట్వీట్..

SMTV Desk 2018-02-10 11:45:55  minister ktr, anchor pradeep, charlapally primary school.

హైదరాబాద్, ఫిబ్రవరి 10 : యాంకర్ ప్రదీప్.. ఘటకేసర్ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠ‌శాల‌లో కనీస వసతులు కరువయ్యాయ౦టూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. బాత్రూమ్ లేదని ఆడపిల్లలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, మంచి నీటి సౌకర్యం కూడా సరిగా లేదని ప్రదీప్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ ట్వీట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ కలెక్టర్‌కు సూచించారు. అంతేకాకుండా విద్యార్థుల సమస్యలను పరిష్కరించిన అనంతరం తనకు తెలియజేయాలని కలెక్టర్‌కు స్పష్టం చేశారు.