"రంగస్థలం" లో రామలక్ష్మిని చూడండి..

SMTV Desk 2018-02-09 18:43:20  rangasthalam movie, samantha teaser, ram charan, sukumar.

హైదరాబాద్, ఫిబ్రవరి 9 : రామ్‌చరణ్‌, సమంత జంటగా నటిస్తున్న "రంగస్థలం" చిత్రంలో చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ లుక్ ను పరిచయం చేసిన దర్శకుడు సుకుమార్.. నేడు సమంతను పరిచయం చేస్తూ మరో టీజర్‌ను విడుదల చేశారు. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా రామలక్ష్మి అనే పాత్రలో సమంత నటిస్తున్నారు. రామలక్ష్మి(సమంత) అలా నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో చిట్టిబాబు(రామ్‌చరణ్‌) ఆమె అందాన్ని వర్ణిస్తూ.. "ఆహా.! ఏం వయ్యారం.. పిల్ల ఎదురొత్తుంటే ఈ ఊరికే 18 సంవత్సరాలు వయసు వచ్చేసినట్టు ఉంటుంది" పేరు రామలక్ష్మండి. ఊరు.. అనగానే రంగా..స్థలానా అంటూ వస్తున్న నేపథ్య సంగీతం అభిమానులను ఆకట్టుకుంది. మైత్రిమూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.