కేసీఆర్ నోరెందుకు విప్పడం లేదు.? : రేవంత్ రెడ్డి

SMTV Desk 2018-02-09 18:11:39  congress leader revanth reddy, comments on kcr, challenge.

కామారెడ్డి, ఫిబ్రవరి 9 : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగినా కేసీఆర్ నోరెందుకు విప్పడం లేదంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గూడలో పర్యటించిన ఆయన అక్కడి దర్గాను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ సవాల్ ను సైతం తెరాసా స్వీకరించాలన్నారు. "బడ్జెట్ లో అన్యాయం జరిగినా కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు ఆయనపై ఉన్న కేసులకు భయపడి మోదీని ప్రశ్నించడం లేదు" అంటూ దుయ్యబట్టారు.