ట్విట్టర్‌లో దూసుకెళ్తున్న కేటీఆర్..

SMTV Desk 2018-02-09 17:53:42  KTR TWITTER, FOLLOWERS, 10 LAKHS.

హైదరాబాద్, ఫిబ్రవరి 9 : నిత్యం సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఐటీ శాఖా మంత్రి కేటీఆర్.. ట్విట్టర్‌లో దూసుకెళ్తున్నారు. ట్విట్టర్‌లో కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య 10 లక్షలు మైలురాయిని చేరుకు౦ది. అనునిత్యం తన పర్యటనలు, కార్యక్రమాల వివరాలు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను సైతం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంటారు. అంతేకాదు ట్విట్టర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆ సమస్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫాలోవర్ల సంఖ్య పదిలక్షలకు చేరుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. "లెట్స్ స్టే కనెక్టెడ్" అంటూ పోస్ట్ చేశారు.