భారత్ కు అందించే సహాయాన్ని కుదించిన ట్రంప్

SMTV Desk 2017-05-29 11:23:41  trump,to cut grant india,decrease grant

న్యూయార్క్, మే 27 : భారత దేశానికి ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అందిస్తున్న సహాయ గ్రాంట్ ను నూతన అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ సగానికి తగ్గించేశారు. ఈ మేరకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదన సిద్దం చేసింది. అయితే మన పొరుగు దేశమయిన పాకిస్థాన్ కు మాత్రం ఈ విషయంలో మినహాయింపునిచ్చింది. ప్రతి సంవత్సరం ముఖ్యంగా 2016 లో అమెరికా 550 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 215 కోట్లకు పరిమితం చేయాలనే ప్రతిపాదనలు సిద్దం అయినట్లు తెలిసింది. అయితే దక్షిణాసియాలోని అన్ని దేశాలకు భారీ కోతలను ట్రంప్ సర్కారు ప్రతిపాదించింది. ఈ మేరకు రూపొందించిన తొలి బడ్జెట్ను విదేశాంగ శాఖ కాంగ్రెస్ సభ ముందుంచింది. అంతర్జాతీయ అభివృద్దికి అమెరికా సంస్థ ప్రపంచ ఆరోగ్య పథకం కింద ఇచ్చే నిధుల్లో భారీగా కోతలను విదించింది. 2016లో 229 కోట్లుగా ఉన్న నిధుల కేటాయింపును ప్రస్తుత సంవత్సరం 126 కోట్లకు పరిమితం చేయడం, అదే విధంగా అంతర్జాతీయ సైనిక విద్య, శిక్షణ కింద ఇచ్చే మెుత్తాన్ని మాత్రం స్వల్పంగా పెంచాలని ప్రతిపాదించారు.