రాజధానిలో పార్కింగ్ ఇబ్బందులు

SMTV Desk 2017-06-25 11:59:49  vehicles, parking, metro, hyderabad, traffice police, ghnc, Contractors, dilsukhnagar, kukatpallu, ameerpet, lbnagar,

హైదరాబాద్, జూన్ 25 : రాజధానిలో వాహనాల పార్కింగ్ సమస్య పరిష్కారానికి బహుళ అంతస్తుల పార్కింగ్ కు కాంప్లెక్సులను నిర్మించాలనుకున్న జీహెచ్ఎంసీ. కానీ సహకరించని గుత్తేదారులు... విషయానికి వస్తే...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక్క రాజధానిలోనే వాహానాల పార్కింగ్ సమస్య కనబడుతుంది. మహానగరంలో వాహనాల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరడంతో ఇన్ని లక్షల వాహనాల పార్కింగ్ కు రోడ్లపై తగినంత జాగా లేక వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. సగం వాహనాలు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి మారో 20 లక్షల వాహనాలు నగరానికి వచ్చి వెళ్తున్నట్లు అంచనా. మొత్తం నగర రహదారులపై రోజు 45 లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు అంచనాతో లెక్కలు వెల్లడించారు. ఈ సందర్భంగా రాజధానిలో 40 చోట్ల బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాలను నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దిల్ సుఖ్ నగర్, అమీర్ పేట, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, పలు చోట్ల ఈ పార్కింగ్ అంతస్తులను నిర్మించాలని అధికారులు తలపెట్టారు. కాని గుత్తేదారులు ఈ టెండర్లకు ముందుకు రావడం లేదు. ఈ పార్కింగ్ ఏర్పాటుకు కనీసం రూ.కోటికి పైనే ఖర్చు కానుందని పార్కింగ్ ఫీజులో వాటా, ఒక అంతస్తులో వాణిజ్య స్థలంగా తీసుకున్నా తమకు లాభదాయకం కాదని గుత్తేదారులు లెక్కలేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుత్తేదారులకు మరిన్ని రాయితీలిచ్చి నిర్మాణం చేపట్టాలని బల్దియా అధికారులు భావిస్తున్నారు. ఇక మెట్రో విషయానికి వస్తే.. హైదరాబాద్ లో 72 కి.మీ. పొడవున మెట్రో రైల్ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణంతో కూడా నగరంలోని వాహన పార్కింగ్ కి కొంత కారణం అవుతుందని వాహనదారులు తెలిపారు. కానీ ఇప్పటి వరకు పార్కింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణంపై మెట్రో అధికారులు చర్యలు తీసుకోలేదు. మొత్తం మెట్రో స్టేషన్లు 63 ఉండగా అందులో 17 స్టేషన్ల వద్ద మాత్రమే పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయి. మరో 16 చోట్ల పార్కింగ్ కేంద్రాలని నిర్మించనున్నారు. ఇటీవల నాంపల్లి దగ్గర పీపీపీ కింద పార్కింగ్‌ సముదాయం నిర్మాణానికి టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ముందుకు రాలేదు. మెట్రో రైలు ప్రారంభమైతే నిత్యం వేలాదిమంది దీనిలో ప్రయాణిస్తారు. ఈ లెక్కన స్టేషన్ల దగ్గర తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి.